English | Telugu

దర్శకేంద్రుడితో మహేష్ మూవీ?

టాలీవుడ్ లో వరుస హిట్లతో జోష్ లో వున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఒకప్పుడు సంవత్సరానికి ఒకటి అనే పద్దతిలో వెళ్ళిన మహేష్ ఆతరువాత సినిమాల సంఖ్య పెంచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా మరో దర్శకుడికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయనెవరో కాదు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు సినిమాతో తెలుగులో హీరోగా పరిచయమైన మహేష్ ఆతరువాత ఈ దర్శకేంద్రుడుతో మరో సినిమా చేయలేదు. మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత ఆయనతో మహేష్ మూవీ చేయబోతున్నాడట. మరి ప్రస్తుత సిచ్యువేషన్‌ లో దర్శకేంద్రుడుతో మహేష్ కా౦బినేషన్ ఎలా వుంటుంది అనేది చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.