English | Telugu

చంద్రబాబు పాత్రలో మహేష్

దివంగ‌త నాయకుడు వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసిన పాద‌యాత్ర ఆధారంగా ‘యాత్ర’ మూవీ తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఐదేళ్ల ముందు అంటే 2019లో రిలీజైన ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. అందులో వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వై.ఎస్‌.ఆర్ త‌న‌యుడు వై.ఎస్‌.జ‌గ‌న్ చేసిన పాద‌యాత్ర‌, 2009-2019 కాలం మ‌ధ్య‌లో జ‌రిగిన ఘ‌ట‌నల ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు మ‌హి వి.రాఘ‌వ‌. ఇందులో కోలీవుడ్ స్టార్, రంగం ఫేమ్ జీవా.. వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

‘యాత్ర 2’లో నారా చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌ను చూపించ‌బోతున్నారు. నిజానికి యాత్ర‌లో ఇత‌ర రాజ‌కీయ నాయ‌కుల పాత్ర‌ల‌ను చూపించ‌లేదు. కానీ యాత్ర 2లో మాత్రం చూపించ‌బోతున్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి చ‌నిపోయిన త‌ర్వాత జ‌గ‌న్ ఓదారు యాత్ర చేయ‌టం, జైలుకు వెళ్ల‌టం, మ‌ళ్లీ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత పాదయాత్ర చేయ‌టం, ముఖ్య‌మంత్రిగా గెల‌వ‌టం వ‌ర‌కు ఈ యాత్ర 2 మూవీ ఉంటుంద‌ని సినీ స‌ర్కిల్స్ స‌మాచారం. ఇందులో చంద్ర బాబు నాయుడు పాత్ర‌లో ప్ర‌ముఖ బాలీవుడ్ యాక్ట‌ర్ మహేష్ మంజ్రేక‌ర్ క‌నిపించ‌బోతున్నారు. ఈ పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతుంది.

సాధార‌ణంగా ఇలాంటి సినిమాల‌ను తెర‌కెక్కించే స‌మ‌యంలో నిజ‌మైన పాత్ర‌ల‌ను పోలిన ల‌క్ష‌ణాల‌తో క్యారెక్ట‌ర్స్‌ను నటీన‌టులు పోషిస్తుంటారు. కానీ మ‌హి వి.రాఘ‌వ్ మాత్రం అలా చేయ‌టం లేదు. పాత్ర‌కు సంబంధించిన ఎమోష‌న్స్‌ను క్యారీ చేసే నటీనటుల‌ను మాత్ర‌మే ఆయ‌న ఎంచుకుంటారు. ఆ కోవ‌లోనే మ‌హేష్ మంజ్రేక‌ర్‌ను ఎంచుకున్నార‌ట‌. మ‌రి యాత్ర 2లో ఇత‌ర రాజ‌కీయ నాయకులు ఎవ‌రు క‌నిపించ‌బోతున్నార‌నేది మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌నుంది. యాత్ర 2 చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8, 2024లో విడుద‌ల చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.