Read more!

English | Telugu

తండ్రులకు తగ్గ తనయులు

తండ్రికి తగ్గ తనయులు అని మన యువ హీరోలని ఫిలిం నగర్ వర్గాలు కొనియాడుతున్నాయి. వివరాల్లోకి వెళితే పద్మభూషణ్, డాక్టర్ ఘట్టమనేని శివరామకృష్ణ అంటే సూపర్ స్టార్ కృష్ణ కొడుకు ప్రిన్స్ మహేష్ బాబు కూడా హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. ఒక హీరోగా సూపర్ స్టార్ ఎన్ని సంచలనాలు సృష్టించారో మనందరికి తెలిసిందే. అదే తరహాలో మహేష్ బాబు కూడా "పోకిరి" వంటి రికార్డులు బ్రేక్ చేసే సినిమానిచ్చారు. అలాగే తండ్రి మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా తన రెండవ చిత్రం "మగధీర" తో తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రనే తిరగరాశాడు.

యువసామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య కూడా తన తొలి చిత్రం "జోష్" ఆశించిన స్థాయిలో హిట్టవ్వక పోయినా ఆ తర్వాత "ఏం మాయ చేశావే", "100%లవ్" చిత్రాలతో హిట్లు కొట్టి తాను కూడా తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఈ ముగ్గురు యువ హీరోలు అంటే ప్రిన్స్ మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ, నాగచైతన్యలు తమ తండ్రులకు తగ్గ తనయుళ్ళుగా పేరు తెచ్చుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో తమ తండ్రుల వారసత్వాన్ని నిరాటంకమగా కొనసాగిస్తున్నారు.