English | Telugu

మహేష్ బాబు దూకుడు షూటింగ్ పూర్తి

మహేష్ బాబు "దూకుడు" షూటింగ్ పూర్తి అయ్యిందని సమాచారం. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, సమంత హీరోయిన్ గా, శ్రీను వైట్ల దర్శకత్వంలో, ఆచంట రామ్, ఆచంట గోపి, అనీల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం"దూకుడు". మహేష్ బాబు "దూకుడు" చిత్రం ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ పూర్తి చేసుకుంది.

త్వరలో మహేష్ బాబు "దూకుడు" చిత్రం యూనిట్ ఈ చిత్రంలోని రెండు పాటల కోసం, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించటం కోసం స్విట్జర్ల్యాండ్ దేశానికి పయనం కానుంది. ఈ చిత్రంలో హీరో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా, అది కూడా అండర్ కవర్ కాప్ గా నటిస్తున్నారట. గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, మహేష్ బాబు హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ "పోకిరి"చిత్రంలో కూడా మహేష్ బాబు అండర్ కవర్‍ కాప్ గానే నటించారు. మరి మహేష్ బాబు "దూకుడు" చిత్రం కూడా "పోకిరి" చిత్రంలా తెలుగు సినిమా చరిత్రను తిరగరాస్తుందేమో వేచి చూడాలి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.