English | Telugu

అనుష్క‌కు అండ‌గా... మ‌హేష్ బాబు

బాహుబ‌లికి పోటీగా కాదుగానీ, ధీద‌టుగా మొదలైన చిత్రం `రుద్ర‌మ‌దేవి`. ఈ సినిమాపైనే గుణశేఖ‌ర్ త‌న ప్రాణాల‌న్నీ పెట్టుకొన్నాడు. అయితే బాహుబ‌లికి వ‌చ్చిన హైప్‌లో, మీడియా ఇచ్చిన ప్ర‌చారంలో రుద్ర‌మ‌దేవికి 10 శాతం కూడా ద‌క్క‌లేదు. అది చాల‌ద‌న్న‌ట్టు... విడుద‌ల‌కు ఎన్నో అడ్డంకులు. వీటి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో గుణ‌శేఖ‌ర్‌కు అర్థం కావ‌డం లేదు. గుణ‌శేఖ‌ర్ ఇబ్బందుల‌న్ని తెలుసుకొన్న చిరు... ఈ సినిమాకి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చి... కాస్త క్రేజ్ తెచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.

ఇప్పుడు మ‌హేష్ బాబు కూడా ముందుకొచ్చాడు. `మీ సినిమాకి అండ‌గా ఉంటా... నా మ‌ద్ద‌తు ఇస్తా. కావాలంటే ప్ర‌మోష‌న్ల‌కు కూడా వ‌స్తా.` అని గుణ‌శేఖ‌ర్‌కు మాటిచ్చాడ‌ట మ‌హేష్‌. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఒక్క‌డు మ‌హేష్ కెరీర్‌కి బూస్ట‌ప్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత అర్జున్‌, సైనికుడు చిత్రాలు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి. అల్లు అర్జున్ పోషించిన గోన‌గ‌న్నారెడ్డి పాత్ర మ‌హేష్‌తో చేయించాల‌ని గుణ‌శేఖ‌ర్ కూడా భావించాడు. కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల్ల అది వ‌ర్కువుట్ కాలేదు.

క‌నీసం ఈ సినిమాకి ఈ రూపంలో అయినా హెల్ప్ చేయాల‌ని మ‌హేష్ భావించాడు. దాంతో గుణ‌కు కొండంత ధైర్యం వ‌చ్చింది. ఇక మీద‌ట రుద్ర‌మ‌దేవి ప్ర‌చారంలో మ‌హేష్ క‌నిపించే అవ‌కాశం ఉంది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.