English | Telugu

బాహుబ‌లిపై రాజ‌మౌళికే న‌మ్మ‌కం లేదా?

బాహుబ‌లి గురించి అంద‌రూ గొప్ప‌గా మాట్లాడుకొంటున్నారు. విడుద‌ల‌కు ముందే... `ఈ సినిమా ఓ క్లాసిక్ అవ్వ‌బోతోంది` అంటూ కితాబులిస్తున్నారు. ప్ర‌భాస్ అభిమానులైతే... `బాహుబ‌లి సౌతిండియా రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయం` అనుకొంటున్నారు. అయితే ఈ మాట‌లు, ఈ అంచ‌నాలూ.... రాజ‌మౌళిని తీవ్రంగా భ‌య‌పెడుతున్నాయి. పెరిగిన అంచ‌నాలకు సినిమా కాస్త అటూ ఇటూ అయినా... బుర్ర తిరిగిపోవ‌డం ఖాయం.

రోజురోజుకీ పెరుగుతున్న అంచ‌నాలకు క‌ళ్లెం ఎలా వేయాలో కూడా రాజ‌మౌళికి అర్థం కావ‌డం లేదు. అయితే ఈ సినిమా ఫ‌లితంపై పై టీమ్‌లోనూ కాస్త భ‌యం ఉన్న‌ట్టు టాక్‌. `సినిమా బాగుంటుంది కానీ.. వ‌చ్చిన హైప్‌కి అందుకోవ‌డం క‌ష్టంగానే అనిపిస్తోంది` అని బాహుబ‌లి టీమ్‌కి ప‌నిచేసిన ప్ర‌ధాన టెక్నీషియ‌న్లు కూడా గుస‌గుస‌లాడుకోవ‌డం విశేషం. ఆఖ‌రికి రాజ‌మౌళి కూడా ఆ భ‌యాన్ని దాచుకోలేక‌పోయాడు. `సినిమా ఎలా ఉంటుందో అన్న టెన్ష‌న్ నాక్కూడా ఉంది. అయితే ఆ భ‌యాన్ని క‌నిపించ‌కుండా క‌వ‌ర్ చేసుకొంటున్నా..` అంటూ బ‌య‌ట‌ప‌డిపోయాడు.

ప్ర‌భాస్ సైతం.. `అంచ‌నాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇది మ‌మ్మ‌ల్ని ఇబ్బంది పెట్టే విష‌య‌మే` అని నిజం ఒప్పుకొన్నాడు కూడా. దాంతో బాహుబ‌లి పై టీమ్‌కే పెద్ద‌గా న‌మ్మ‌కాల్లేవ‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది. ఇప్పుడొచ్చిన హైప్ ప్ర‌కారం చూస్తే.. తొలివారం రోజులూ ఈసినిమా రికార్డ్ బ్రేక్ చేయ‌డం ఖాయం. అయితే.. ఆ తర‌వాత నిల‌బ‌డాలంటే, పెట్టిన ఖ‌ర్చు రాబ‌ట్టుకోవాలంటే... బాహుబ‌లి ఓ క్లాసిక్‌లా నిల‌బ‌డాల్సిందే. అయితే బాహుబ‌లికి అంత సీన్ ఉందా, లేదా? అనే విష‌యం విడుద‌ల అయితే గానీ తెలీదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.