English | Telugu

మహేష్ సారీ చెప్పేసాడు.

మహేష్ నటించిన "1" సినిమా పోస్టర్ పై వస్తున్న వివాదానికి మహేష్ స్పందించాడు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.... ఈ వివాదం రేగడం దురదృష్టకరమని, ఆ పోస్టర్‌ గురించి ఇందరు ఇన్ని రకాలుగా వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉందని అన్నాడు. అది కేవలం " కొంతసేపు ఫిషింగ్ చేద్దామా" అన్న పాటలోని భాగమే తప్ప మరొకటి కాదని చెప్పాడు. ఎవరైనా ఇందుకు బాధపడి ఉంటే సారీ చెబుతున్నాను. "1" మూవీలోని ఈ సాంగ్‌ని చూసి మీరు, మీ ఆలోచనా ధోరణిని మార్చుకుంటారని ఆశిస్తున్నాను" అని మహేష్ అన్నాడు. మరి మహేష్ చెప్పిన సారీ వలన ఈ వివాదం ముగిసిపోతుందో లేదో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.