Read more!

English | Telugu

సూపర్ స్టార్ మెచ్చిన 'మేమ్ ఫేమస్'

ఇటీవల ప్రమోషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిన చిన్న సినిమా 'మేమ్ ఫేమస్'. సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్, లహరి ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించాయి. రేపు(మే 26 న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. మేమ్ ఫేమస్ మూవీ అదిరిపోయిందని ప్రశంసించడం విశేషం.

ఛాయ్ బిస్కెట్ నిర్మాతలు అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్రకు మహేష్ తో మంచి అనుబంధం ఉంది. వారితో కలిసి మహేష్ 'మేజర్' సినిమాని కూడా నిర్మించాడు. ఇప్పుడు 'మేమ్ ఫేమస్' కోసం తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చాడు. తాజాగా ఈ సినిమాని చూసిన మహేష్, టీంని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. "మేమ్ ఫేమస్ మూవీ అద్భుతంగా ఉంది. నటీనటులంతా తమ నటనతో కట్టిపడేశారు. ముఖ్యంగా సుమంత్ ప్రభాస్ రచయితగా, దర్శకుడిగా, నటుడిగా తన అద్భుతమైన ప్రతిభతో మెప్పించాడు. కొత్తవారు ఈ సినిమా తీశారంటే నమ్మలేకపోతున్నాను. ఇలాంటి ప్రతిభను ప్రోత్సహిస్తున్న శరత్‌ చంద్ర, అనురాగ్‌ రెడ్డి పట్ల గర్వంగా ఉంది" అంటూ మేమ్ ఫేమస్ టీంపై ప్రశంసలు కురిపించాడు మహేష్. మరి "మేమ్ ఫేమస్ అద్భుతం" అంటూ మహేష్ ఇచ్చిన మొదటి రివ్యూ సినిమాకి ఏ స్థాయిలో హెల్ప్ అవుతుందో చూడాలి.