English | Telugu

మ‌హేష్ కూడా చేతులు కాల్చుకొంటాడా?

చిత్ర నిర్మాణం అనేది ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. హేమా హేమీలైన‌వాళ్లే నిర్మాత‌లుగా డింకీలు కొడుతుంటారు. ప‌రిశ్ర‌మ‌లో ఏ నిర్మాత ప‌రిస్థితీ బాలేదు. అలాంటిది ఈ విష‌యాల‌న్నీ తెలిసి తెలిసి త‌ప్పు చేయ‌బోతున్నాడు మ‌హేష్ బాబు. ఔను.. మ‌హేష్ సొంతంగా ఓ నిర్మాణ సంస్థ‌ను నెల‌కొల్పాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. త‌న త‌న‌యుడు గౌత‌మ్ పేరుతో ఓ బ్యాన‌ర్‌ని స్థాపించాల‌ని, ఆ బాధ్య‌త శ్రీ‌మ‌తి న‌మ్ర‌త చేతిలో పెట్టాల‌ని చూస్తున్న‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెప్పుకొంటున్నాయి. మ‌హేష్ ఇంట్లో నిర్మాత‌ల‌కు కొద‌వ లేదు. ప‌ద్మాల‌యా స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సినిమాలు చేసుకోవ‌చ్చు. ఇందిర ప్రోడ‌క్ష‌న్స్ కూడా ఉంది. అయినా స‌రే... త‌న చేతిలోమ‌రో నిర్మాణ సంస్థ ఉండాల‌ని మ‌హేష్ భావిస్తున్నాడ‌ట‌. ఈ సంస్థ నుంచి ఏడాదికి ఒక సినిమా వ‌చ్చేట్టు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. బ‌డా హీరోలూ నిర్మాత‌లైన వైనం మ‌న‌కు తెలుసు. కాక‌పోతే.. వాళ్లంతా దాదాపుగా చేతులు కాల్చుకొన్న‌వారే. అంతెందుకు మ‌హేష్ సోద‌రుడు ర‌మేష్ బాబుకీ నిర్మాత‌గా చేదు అనుభ‌వాలున్నాయి. మ‌రి మ‌హేష్ ఎందుకు ఇంత సాహ‌సం చేస్తున్నాడో?


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.