English | Telugu

మహేష్‌బాబు సినిమాల వల్లే అఖండ2 రిలీజ్‌ వాయిదా!

- ఆ రెండు సినిమాలే ప్ర‌ధాన కార‌ణం
- నిర్మాత‌ల‌కు, అభిమానుల‌కు షాక్‌
- ఒక‌రోజు ఆల‌స్యానికి కార‌ణ‌మిదే

కొద్ది గంటల్లో ప్రీమియర్స్‌ ద్వారా 'అఖండ2' చిత్రాన్ని వీక్షించేందుకు నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆకస్మికంగా ప్రీమియర్స్‌ రద్దు కావడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. తాజా సమాచారం మేరకు డిసెంబర్‌ 5న ప్రీమియర్స్‌, డిసెంబర్‌ 6న రెగ్యులర్‌ షోలు ప్రదర్శిస్తారని తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ వంటి టాప్‌ హీరో సినిమా ఇలా అర్థాంతరం వాయిదా పడడం వెనుక కారణాల గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు.


ప్రీమియర్స్‌ని రద్దు చేయడం వెనుక టెక్నికల్‌ అంశాలు ఉన్నాయంటూ మొదట వినిపించినప్పటికీ అసలు కారణాలు ఆర్థికపరమైనవని తర్వాత తెలిసింది. ఇదిలా ఉంటే.. 'అఖండ2' రిలీజ్‌ వాయిదా పడడం వెనుక మహేష్‌బాబు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. 2014లో మహేష్‌బాబు, సుకుమార్‌ కాంబినేషన్‌లో '1 నేనొక్కడినే', మహేష్‌బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో 'ఆగడు' చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయాయి.


'1 నేనొక్కడినే', 'ఆగడు' చిత్రాలను 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించింది. ఈ రెండు సినిమాలకు బాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ భాగస్వామిగా ఉంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలకు ఈ రెండు సినిమాలు నష్టాలను తెచ్చిపెట్టాయి. ఆ సందర్భంలోనే ఈరోస్‌కు 14 రీల్స్‌ సంస్థ 28 కోట్లు బకాయిపడినట్టు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని చెల్లించకుండా వాయిదా వేస్తూ వస్తున్న 14 రీల్స్‌ సంస్థపై ఈరోస్‌ కోర్టుకెక్కింది. దాని ఫలితంగానే 'అఖండ2' చిత్రం వాయిదా పడింది.


సరిగ్గా రిలీజ్‌ రేపు అనగా మద్రాస్‌ హైకోర్టులో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ పిటిషన్‌ దాఖలు చేయడం, దాన్ని స్వీకరించిన కోర్టు.. 'అఖండ2' చిత్రం రిలీజ్‌ని ఆపాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిపోయాయి. దీంతో చిత్ర నిర్మాతలే కాదు, సినిమా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు, అభిమానులు సైతం షాక్‌ అయ్యారు. ఎవరూ ఊహించని ఈ పరిణామం వల్ల ఒక భారీ సినిమా రిలీజ్‌కి అంతరాయం కలిగింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆర్థిక పరమైన లావాదేవీలను 14 రీల్స్‌ సంస్థ పూర్తి చేసిందని, ఇక రిలీజ్‌కి ఎలాంటి ఇబ్బందీ లేదని తెలుస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.