English | Telugu
ఆది పురుష్ పరిస్థితి అర్థం కావడం లేదు!
Updated : Feb 14, 2023
భారతీయులు పవిత్ర గ్రంథం గా భావించేది రామాయణం. ఈ మైథలాజికల్ స్టోరీని మోడ్రనైజ్ చేసి అదే పేరుతో ఆధునికరించడాన్ని మనం జీర్ణించుకోలేం. రామాయణాన్ని మోడ్రర్నైజ్ చేస్తే దానికి హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. రామాయణాన్ని భారతీయులు ఎలా చూడాలని భావిస్తున్నారు అనేది తెలుసుకుని అలానే తీయాలి గాని టెక్నాలజీని ఉపయోగించి ఇష్టా రీతిగా తీస్తామంటే సహించేది ఉండదని ఇప్పటికే ఆది పురుష్ టీంకి హెచ్చరికలు వెళ్లాయి. దాంతో సినిమా గ్రాఫిక్స్ వర్క్ ఫై మరలా మరోసారి వర్క్ స్టార్ట్ చేశారు. టి సిరీస్ భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ఈ చిత్రానికి వచ్చిన నెగటివిటీకి తోడు ప్రభాస్ చేసిన చివరి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించలేదు. దీంతో సినిమాకి బయట నుండి వస్తున్న ధియేట్రికల్ ఆఫర్స్ కూడా తగ్గిపోయాయని సమాచారం. ఓవర్సీస్ లో ఆదిపురుష్ మూవీ ని కేవలం 35 కోట్లకు మాత్రమే అడుగుతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ నుండి వస్తున్న సినిమా అయినా కూడా అంతకుమించి ఇచ్చేందుకు ఎవరు మొగ్గు చూపడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో తాము అనుకున్న బడ్జెట్ కి అనుగుణంగా తీసుకోవడానికి ఎవరైనా వస్తే సరి లేకపోతే ఈ మూవీని తామే సొంతంగా విడుదల చేయాలని నిర్మాతల ఆలోచనగా తెలుస్తోంది.
ఆ అమౌంట్ కి ఎవరు ముందుకు రాకపోతే తామే సరిగమ ద్వారా ఓవర్సీస్ లో రిలీజ్ చేయాలని నిర్మాత భూషణ్ కుమార్ భావిస్తున్నారు. కనీసం ఈ సినిమా ఓవర్సీస్ ద్వారా 100 కోట్లను ఆయన ఆశిస్తున్నాట్లు సమాచారం. భూషణ్ కుమార్ కు సినిమాపై భారీగా నమ్మకముంది. ప్రభాస్ కెరీర్ లోనే గొప్ప చిత్రంగా ఇది నిలుస్తుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుకున్న ధర రాకపోతే నేరుగా ఓన్ రిలీజ్కే మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.