English | Telugu
రజినీకి నో చెప్పిన శర్వా.. సీన్‌లోకి మరో టాలీవుడ్ స్టార్
Updated : Sep 6, 2023
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు జైలర్ సక్సెస్ కిక్ మీదున్నారు. ఏకంగా ఆయన సినిమా రూ.600 కోట్ల మార్క్‌ను క్రాస్ చేయటంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీంతో ఆయన నెక్ట్స్ మూవీస్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కి చేరుకుంటున్నాయి. ఆయన కీలక పాత్రలో నటించిన లాల్ సలాం సినిమా ఈ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇక ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న మరో భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. తలైవాతో పాటు బిగ్ బీ ఇందులో నటిస్తుండటం విశేషం. ఇందులో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్‌తో పాటు మంజు వారియర్ కూడా నటిస్తుంది. వీరందరూ కాకుండా తెలుగు నుంచి ఓ హీరోను నటింప చేయటానికి మేకర్స్ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ముందుగా లైకా ప్రొడక్షన్స్ హీరో నానిని సంప్రదించింది. ఆయన వద్దన్నారు. ఆ తర్వాత శర్వానంద్ నటిస్తారనే వార్తలు వినిపించాయి. కానీ తీరా ఇప్పుడు వినిపిస్తోన్న సమాచారం మేరకు శర్వా కూడా రజినీకాత్ 170వ సినిమాలో నటించటానికి సుముఖంగా లేనని క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తుంది. అందుకు కారణం.. ఆ పాత్రలో నెగెటివ్ షేడ్ ఉండటమే. దీంతో మేకర్స్ టాలీవుడ్‌కి చెందిన రానా దగ్గుబాటిని సంప్రదించారు. రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు.
ఈ సినిమాలో రజినీకాంత్ ఎన్‌కౌంటర్స్‌కు వ్యతిరేకంగా పోరాడే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లోకనిపించబోతున్నారు. జై భీమ్ ఫేమ్ టి.జి.జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేస్తారనే వార్తలు కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తో సినిమా ఉంటుందని సమాచారం.