English | Telugu

'ఖుషి' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఊర మాస్ బ్యాటింగ్!

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' సినిమా క్లాస్ గా ఉంది కానీ కలెక్షన్స్ మాత్రం ఊర మాస్ గా ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఫస్ట్ వీకెండ్ లోనే రూ.30 కోట్లకు పైగా షేర్ సాధించిన ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.9.87 కోట్ల షేర్, రెండో రోజు రూ.5.36 కోట్ల షేర్, మూడో రోజు రూ.5.68 కోట్ల షేర్ రాబట్టిన ఖుషి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మూడు రోజుల్లో రూ.20.91 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఏరియాల వారీగా చూస్తే మూడు రోజుల్లో నైజాంలో రూ.11.20 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.2.03 కోట్ల షేర్, ఆంధ్రాలో రూ.7.68 కోట్ల షేర్ రాబట్టింది. ఇక రెస్టాఫ్ ఇండియా రూ.4.55 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.7.10 కోట్ల షేర్ కలిపి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.32.56 కోట్ల షేర్ వసూలు చేసింది.

వరల్డ్ వైడ్ గా రూ.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఖుషి మూవీ.. మొదటి రోజు రూ.15.37 కోట్ల షేర్, రెండో రోజు రూ.8.46 కోట్ల షేర్, మూడో రోజు రూ.8.73 కోట్ల షేర్ తో మూడు రోజుల్లో.. రూ.32.56 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.21 కోట్ల షేర్ దాకా రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో కూడా జోరు కొనసాగిస్తే.. రెండో వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది.

'ఖుషి' 3 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ.11.20 కోట్ల షేర్
సీడెడ్ : రూ.2.03 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.7.68 కోట్ల షేర్

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.20.91 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ.4.55 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.7.10 కోట్ల షేర్

ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల కలెక్షన్స్ : రూ.32.56 కోట్ల షేర్

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.