English | Telugu
కారు డీ కొట్టింది..హాట్ హీరోయిన్ సేఫ్
Updated : Jan 29, 2014
ఇటీవలే యువ గాయకురాలు శ్రావణ భార్గవి రోడ్డు ప్రమాదం నుండి తప్పించుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా మరో సినీ నటి కూడా రోడ్డు ప్రమాదం నుండి తప్పించుకొని బయటపడింది. ప్రముఖ హాట్ బ్యూటీ, నటి ఖుష్బు కారు ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఖుష్బు చెన్నైలోని తన ఇంటినుండి కారులో బయలుదేరింది. రెడ్ సిగ్నల్ పడడంతో జంక్షన్ దగ్గర ఆగింది. అయితే ఇంతలో సడెన్ గా సిటీ బస్సు వచ్చి ఖుష్బు కారును వెనుక భాగం నుండి బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు ఒక్కసారిగా కుదుపుకు గురైంది. కారు వెనుకభాగం కూడా బాగా ధ్వంసమైంది. అదృష్టంకొద్ది కారులో ఉన్న ఖుష్బుకు మాత్రం ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.
ఈ విషయం పై ఖుష్బు తన అభిప్రాయాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. "తన కెలాంటి ప్రమాదం జరగలేదని, అయితే ముందు వెళ్లే వెహికల్స్ ని చూడకుండా నిర్లక్ష్యంగా బస్సును నడిపిన డ్రైవర్‌పై నాకు చాలా కోపం వచ్చింది. డ్రైవర్ చేసిన పొరపాటు వల్ల నా కారు నాశనం అయింది. అతనిపై కంప్లయింట్ చేస్తే కోర్టు శిక్షించవచ్చు. కానీ ఆ డ్రైవర్ కుటుంబం నడిరోడ్డున పడుతుందని నేను ఆలోచించి కంప్లయింట్ చేయలేదు. కానీ ఈ ఖరీదైన కారును నా భర్త నాకు బహుమతిగా ఇచ్చారు. అలాంటి కారు ధ్వంసం కావడం బాధగా ఉంది" చెప్పింది.