English | Telugu

కృతిశెట్టి బర్త్‌ డే : స్పెషల్‌ వీడియోతో సెలబ్రేట్‌ చేసిన యూనిట్‌

‘ఉప్పెన’ చిత్రంతో ఓ ఉప్పెనలా దూసుకొచ్చి కుర్రకారుకి గిలిగింతలు పెట్టిన క్యూట్‌ హీరోయిన్‌ కృతిశెట్టి. ‘ఉప్పెన’ చిత్రం ఘన విజయంతో కృతికి వచ్చిన అప్లాజ్‌ మామూలుగా లేదు. ఈ సినిమా తర్వాత ఓ అరడజను సినిమాలకుపైగా చేసిన కృతి. ఇప్పుడు శర్వానంద్‌తో జతకడుతోంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో శర్వా35గా పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ కృతిశెట్టి బర్త్‌డే వచ్చింది. దీంతో చిత్ర యూనిట్‌ ఆమె బర్త్‌డేను ఒక సినిమా అప్‌డేట్‌తో సెలబ్రేట్‌ చేశారు.

శర్వానంద్‌ నటించే ఈ 35వ సినిమాలో కృతి ఎంతో క్యూట్‌గా కనిపిస్తూ మరోసారి తన అందంతో, అభినయంతో అందర్నీ అలరించేందుకు రెడీ అయింది. ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఈ వీడియోలో కృతిశెట్టికి చెందిన సీన్స్‌ను షూట్‌ చేస్తున్నప్పు మూమెంట్స్‌ను చూపించారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.