English | Telugu

హీస్ట్ థ్రిల్లర్ తునివు ఓటిటి రిలీజ్ అప్పుడే!

హీస్ట్ థ్రిల్లర్ తునివు సినిమా ఓటిటి రిలీజ్ కి టైం ఫిక్స్ అయింది. అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. దళపతి విజయ్ నటించిన వారిసు సినిమాతో బాక్సాఫీస్ క్లాష్‌ ఏర్పడింది తునివు సినిమాకి. ఈ రెండు సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యాయి. తునివు సినిమా ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ 187.60 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసింది. ఇండియాలో మాత్రం 114.75 కోట్ల నెట్ కలెక్ట్ చేసిందిజ‌ ఈ సినిమాకి తమిళంలో వారిసు మాత్రమే కాదు, తెలుగు నుంచి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి కూడా పోటీకి నిలిచాయి. తునివు ప్రేక్షకాదర‌ణ పొందింది. సంక్రాంతికి థియేటర్లో దీపావళి వేడుక జరిగిందని అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు.

ఈ సినిమాను ఫిబ్రవరి 8న నెట్‌ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు అజిత్ కుమార్. ఫైనల్ గా ఇక్కడ వాలారు... ఇది ఎక్స్‌ప్లోష‌న్‌ కి టైం అంటూ బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది ఓటిటి సంస్థ . తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీలో ఈ సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ఇది. అజిత్ కుమార్, మంజు వారియ‌ర్ నటించిన యాక్ష‌న్ సీక్వెన్స్ హైలైట్ అయ్యాయి సముద్రంలో ఫైట్ వేరే లెవ‌ల్‌లో ఉంటుంది మూవీలో. ఈ సినిమాని హెచ్ వినోద్ దర్శకత్వం చేశారు.

బోనీ కపూర్ నిర్మాత‌. హెచ్‌.వినోద్ డైర‌క్ష‌న్‌లో అజిత్ కుమార్ న‌టించిన‌ మూడో సినిమా ఇది. నెర్కొండ పార్వై, వ‌లిమై సినిమాల త‌ర్వాత విడుద‌లైన మూడో సినిమా ఇది. ఇప్పుడు అజిత్ నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నారు. అజిత్ నెక్స్ట్ మూవీకి డైర‌క్ట‌ర్ ఎవ‌ర‌నే విష‌యంలో చిన్న క‌న్ఫ్యూజ‌న్ ఇంకా కంటిన్యూ అవుతోంది.