English | Telugu

సల్మాన్ ఖాన్ సినిమాకి కోన వెంకట్ కథ

సల్మాన్ ఖాన్ సినిమాకి కోన వెంకట్ కథను అందిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మొన్నామధ్య సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ ల ప్రచారం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ కు వచ్చాడు. ఆ సందర్భంగా తాను హిందీలో నటిస్తున్న "రెడీ" సినిమాకు కథనందించింది కోన వెంకట్ అని తెలుసుకున్నాడట. వెంటనే కోన వెంకట్ తో భేటీ అయ్యాడు సల్మాన్ ఖాన్. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాలీవుడ్లో ప్రవేశించాలనుకునే కోన వెంకట్ కు ఇదొక సువర్ణావకాశంగా భావించి, సల్మాన్ తో పూర్తి స్థాయిలో చర్చలు జరిపాడు. ఆ చర్చలు సఫలం అయ్యాయి.

ఫలితంగా సల్మాన్ ఖాన్ నటించబోయే "షేర్ ఖాన్" అనే సినిమాకి కథనందించాల్సిందిగా కోన వెంకట్ ను కోరాడు సల్మాన్ ఖాన్. "షేర్ ఖాన్‍" సినిమాతో డైరెక్టుగా బాలీవుడ్ సినిమాలకు కథలనందించేందుకు సిద్ధమవుతున్నాడు కోన వెంకట్. ఇక మీదట కోన వెంకట్ తెలుగు సినిమాలకు కథలనందించటం కష్టమే. అందుకే అంటారు ఏ క్షణం ఎవరికి ఎలాంటి అదృష్టాన్నందిస్తుందో ఎవరూ చెప్పలేరని.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.