English | Telugu
తండ్రి కాబోతున్న మంచు విష్ణు
Updated : May 14, 2011
మంచు విష్ణు త్వరలో తండ్రి కాబోతున్నాడట. అంటే ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, విద్యాదాత, కలెక్షన్ కింగ్, పద్మశ్రీ, డాక్టర్ మంచు మోహన్ బాబు తాతకాబోతున్నారన్న మాట. వివరాల్లోకి వెళితే యువ హీరో మంచు విష్ణువర్థన్ తాను ప్రేమించిన వెరోనికను పెద్దల అంగీకారంతో వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వారి వైవాహక జీవితం చాలా సంతోషదాయకంగా జరుగుతోంది. అయితే ఇటీవల వెరోనిక గర్భవతి అయ్యిందన్న మాట ఫిలిం నగర్ లో బహుళప్రచారంలో ఉంది.
ఫిలిం నగర్ వర్గాల మాట ప్రకారం రానున్న డిసెంబర్ లో మమచు విష్ణు తండ్రికాబోతున్నాడట. అంటే మంచు మనోజ్ కుమార్ బాబాయ్, మంచు లక్ష్మీ ప్రసన్న మేనత్త కాబోతున్నారు. మంచు వారింట్లో మరో వారసుడు రాబోతున్నాడు. ఈ వార్త తెలిసిన దగ్గర నుమచీ మంచు వారింట్లో ఆనందం ఆర్ణవమవుతోంది. సహజమే కదా...మనోజ్ తర్వాత వాళ్ళింట్లో తొలి పసిబిడ్డ పుట్టబోతూండటం వారికి అమిత సంతోషం కలిగించే విషయమే కదా. వెరోనిక వచ్చేనెలలో యు.యస్. నుండి ఇండియాకు రానుంది. ఈ సందర్భంగా విష్ణుకు తెలుగువన్ కంగ్రాట్స్ చెపుతోంది.