English | Telugu

వాయిదా పడనున్న అల్లు అర్జున్ "బద్రీనాథ్"

అల్లు అర్జున్ "బద్రీనాథ్" వాయిదా పడుతుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, డాడైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, అత్యంత భారీ బడ్జెట్ తో, మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "బద్రీనాథ్". అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమాని తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. అంతే కాక తమిళం కోసం కొందరు తమిళ నటీనటులతో తమిళంలో రీషూట్ చేశారట. మళయాళంలోకి మామూలుగా అనువదిస్తున్నారు.

ఎందుకంటే మళయాళంలో అంటే కేరళలో అల్లు అర్జున్ కి యువహీరోగా మంచి ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన తెలుగు సినిమాలు గతంలో కేరళలో ఘనవిజయం సాధించాయి. ఈ రీషూట్ వల్ల, అనువాద కార్యక్రమాల వల్ల అల్లు అర్జున్ "బద్రీనాథ్" సినిమా అనివార్యంగా ఆలస్యమవుతుందట. ముందుగా అనుకున్న ప్రకారం జూన్ 3 వతేదీన అల్లు అర్జున్ "బద్రీనాథ్" మూవీ రిలీజ్ కావలసి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే జూన్ 17 అంటే రెండు వారాల పాటు అల్లు అర్జున్ "బద్రీనాథ్" విడుదల వాయిదా పడేలా ఉంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.