English | Telugu

విశాల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఎంగేజ్‌మెంట్‌తో సర్‌ప్రైజ్‌ చేసిన కోలీవుడ్‌ స్టార్‌!

తమిళ్‌తో పాటు తెలుగులోనూ హీరోగా మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న హీరో విశాల్‌. 48 ఏళ్ళ విశాల్‌ ఇప్పటివరకు బ్యాచ్‌లర్‌ లైఫ్‌నే గడిపారు. ఆగస్ట్‌ 29న అతని పుట్టినరోజు సందర్భంగా ప్రేక్షకులను, అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. నటి సాయిధన్సికను వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించడమే కాకుండా పుట్టిన రోజు సందర్భంగా ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిరచారు. అయితే ఈ వేడుకను ఎంతో సింపుల్‌గా ఇరు కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. విశాల్‌, సాయిధన్సికకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు.

తెలుగువాడైనప్పటికీ తమిళ్‌లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు విశాల్‌. అతను చేసిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్‌ అయి విజయం సాధిస్తున్నాయి. 40 ఏళ్లు పైబడినా పెళ్లి జోలికి వెళ్ళని హీరోలు ఎంతో మంది ఉన్నారు. వారి బాటలోనే వెళ్లిన విశాల్‌.. సాయిధన్సికతో రిలేషన్‌ గురించి కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. అయితే వివాహాన్ని మాత్రం కొన్నాళ్లు వాయిదా వేశారు. దానికి కారణం నడిగర్‌ సంఘం భవన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడమే. తన పుట్టినరోజున ఎంగేజ్‌మెంట్‌ జరుపుకొని అందర్నీ సర్‌ప్రైజ్‌ చేశారు. 2006లో మనతోడు మజైకాలం చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు సాయిధన్సిక. తెలుగులో షికారు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాల్లో నటించారు. విశాల్‌, సాయిధన్సిక మధ్య వయసులో 12 ఏళ్ళ గ్యాప్‌ ఉండడం గమనార్హం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.