English | Telugu

'దసరా'పై అంత నమ్మకమా.. బంగారం ఇచ్చిన కీర్తి!

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ 'దసరా'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై నాని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అందుకే అంతా తానై ముందుండి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నాడు. అయితే కీర్తి సురేష్ సైతం ఈ చిత్రంపై అదే స్థాయిలో నమ్మకం పెట్టుకుంది. తాజాగా ఆమె మూవీ టీమ్ అందరికి గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు సమాచారం.

'మహానటి' తరువాత కీర్తికి ఆ స్థాయి విజయం దక్కలేదు. ఇప్పుడు 'దసరా'తో మరో ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా.. నటిగా ఆ స్థాయి గుర్తింపు వస్తుందనే నమ్మకం కీర్తిలో ఉంది. ఇందులో ఆమె వెన్నెల అనే పాత్ర పోషించింది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా అవుట్ పుట్ పట్ల కీర్తి చాలా సంతృప్తిగా ఉందట. ఇంత మంచి అవుట్ పుట్ రావడానికి కృషి చేసిన టీం అందరికీ.. ఆమె గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చిందట. మరి కీర్తి నమ్మకం నిజమై దసరా ఘన విజయం సాధిస్తుందేమో చూద్దాం.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...