English | Telugu
తెలుగువారు వచ్చే ఎన్నికల్లో నాకు ఓట్లు వేస్తారు
Updated : Nov 5, 2024
ప్రముఖ సినీనటి కస్తూరి(kasthuri)ఇటీవల చెన్నై లోని ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ లో తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లందరూ కస్తూరి మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో కస్తూరి మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వడం జరిగింది.
ఆమె మాట్లాడుతూ 'తెలుగు వారి గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. తెలుగు వారంటే నాకు చాలా ఇష్టం. డిఎంకే(dmk)పార్టీ తమ రాజకీయ స్వార్ధం కోసం నా మాటలని వక్రీకరించడం జరిగింది.నన్ను తమిళనాడు వాళ్ళ కంటే తెలుగు వల్లే ఎక్కువగా ఆదరించారు.సినిమాల పరంగా గాని, సీరియల్స్ పరంగా గాని నాకు తెలుగు సరిగా రాకపోతే, నా తప్పులని క్షమించి నన్ను ఎంతగానో ఆదరించారు. నా భర్త ఆంధ్రాకి చెందిన వ్యక్తే. తెలంగాణాలో బతుకుతున్నాను. కాబట్టి తెలంగాణ నా పుట్టిల్లు అయితే ఆంధ్ర నా మెట్టినిల్లు.
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)కి నేను పెద్ద అభిమానిని. త్వరలోనే ఆయన్ని కలిసి నా మాటలపై పూర్తి వివరని ఇస్తాను.తమిళనాడులో సనాతన ధర్మాన్ని డిఎంకే పార్టీ అవమానిస్తుంది.ఈ విషయంలో పవన్ తో కలిసి పోరాటం చెయ్యడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా యాక్టీవ్ గా ఉంటాను. తమిళనాడులో తెలుగువారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్న చోట రాబోయే ఎలక్షన్స్ లో పోటీ చేసి తెలుగు వారి ఓట్లతోనే గెలుస్తానని చెప్పుకొచ్చింది.