English | Telugu

రామ్ కందిరీగ ఫస్ట్ లుక్

రామ్ "కందిరీగ" ఫస్ట్ లుక్ ఎప్పుడంటే రేపేనని ఫిలిమ నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై, యువహీరో, చురుకైన గ్లామరస్ హీరో రామ్ హీరోగా, హన్సిక మోత్వానీ హీరోయిన్ గా, కలర్స్ స్వాతి గెస్ట్ రోల్ లోనూ, శ్రియ శరణ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తూండగా, సోనూ సూద్ విలన్ గా, సంతోష్ శ్రీనివాస్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం" కందిరీగ". ఈ చిత్రంలోని స్టిల్స్, వాల్ పపేర్స్ ఇంతవరకూ బయటకు రాలేదు.

మరి "కందిరీగ" సినిమా పబ్లిసిటీ కావాలంటే సినిమా మొదలెట్టిన దగ్గర నుంచీ ఈ సినిమా గురించి మెల్ల మెల్లగా ప్రచారం చేస్తేనే సినిమా జనంలోకి వెళుతుందనీ, ప్రేక్షకులకు "కందిరీగ" మీద ఒక విధమైన ఆసక్తి కలుగుతుందనీ "కందిరీగ" చిత్రానికి పి.ఆర్.వో. గా ఉన్న బి.ఎ.రాజు చెప్పటంతో "కందిరీగ" చిత్రంలోని స్టిల్స్ మీడియాకు అందించారు. ఈ సినిమాలో హీరో రామ్ చాలా గ్లామరస్ గా ఉన్నాడని వినికిడి. వినికిడేం ఖర్మ ఈ స్టిల్ చూస్తే మీకే అర్థమవుతుంది. రామ్ ఎంత అందంగా ఉన్నాడో.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.