English | Telugu
ఆవకాయ బిర్యానీ కాదు ఇక పప్పన్నమే
Updated : Sep 19, 2013
"గోదావరి, ఆవకాయ బిర్యానీ, కలవరమాయే మదిలో, ఛత్రపతి, విరోధి, అరవింద్ 2" వంటి చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నటుడు కమల్ కామరాజు త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చెన్నైలో పనిచేస్తున్న సుప్రియతో అక్టోబర్ 6న నిశ్చితార్ధానికి డేట్ ఖరారు అయిందని, ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలిసింది. వీరి పెళ్లి వేడుక డిసెంబర్‌లో జరుగనుందని సమాచారం. మరి టాలీవుడ్ నుండి మరో కుర్రాడు కూడా పప్పన్నం పెట్టించనున్నాడన్నమాట.