English | Telugu
అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాలు: కమల్
Updated : Dec 26, 2013
బెంగుళూరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని గురువారం ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ సినిమా రంగం భారత్ వైపు చూస్తోంది. ఈ సమయంలో సినిమా నిర్మాణంలో నాణ్యతను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ సినిమాల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలి. దేశవ్యాప్తంగా 15 భాషల్లో ప్రతి సంవత్సరం వెయ్యికి పైగా సినిమాలు వస్తున్నాయి. సమాచార సాంకేతిక రంగంలో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందిన బెంగుళూరు సినిమా రంగంలోనూ రాణించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.