English | Telugu

క‌మ‌ల్ మాకు న‌చ్చ‌లేదు.. న‌చ్చ‌లేదు.. న‌చ్చ‌లేదు

క‌మ‌ల్ హాస‌న్ గొప్పోడే కావ‌చ్చు.... కానీ మాకు న‌చ్చ‌లేదు... న‌చ్చ‌లేదు.. న‌చ్చ‌లేదు.
ఎంత ద్రోహం, ఇంకెంత అన్యాయం చేశాడో ఈత‌రం న‌టుల‌కు!?

చేయాల్సిన గొప్ప పాత్ర‌ల‌న్నీ తానే చేసేశాడు. అమాయ‌కుడు తానే, వెర్రిబాగులోడూ త‌నే. డాన్స‌రూ తానే, ఫైట‌రూ తానే. పొట్టోడూ తానే, గాయ‌కుడూ తానే. ఆఖ‌రికి జార్జి బుష్షూతానే.
ఇక ఈత‌రం న‌టుల‌కు ఇంకేం మిగిలి చ‌చ్చింద‌ని..?? న‌టుడంటే తానొక్క‌డేనా, మిగిలిన‌వాళ్లు కారా?
అరె.. కాస్త గొప్ప‌గా యాక్ట్ చేద్దామ‌ని చూస్తే చాలు `ఓరేయ్ క‌మ‌ల్ హాస‌న్ లా యాక్ట్ చేయాల‌ని చూస్తున్నాడ్రోయ్‌` అనేస్తాడు.

నిజంగా అద్భుతంగా చేసినా... - `క‌మ‌ల్ హాసన్‌ని ఇమిటేట్ చేశాడ‌౦టున్నారు.
న‌ట‌న‌లో అద్భుతానికి మ‌రో పేరే తానై కూర్చుంటే - ఈ త‌రం పేరు తెచ్చుకొనేదెలా..??

విమ‌ర్శ‌కుల‌కూ అత‌నేం మింగుడు ప‌డ‌డు.
అరె... మ‌నిష‌న్నాక‌, వాడో న‌టుడ‌య్యాక‌ ఎక్క‌డో ఓ చోట త‌ప్పు చేయాలి క‌దా? ద‌శావ‌తారంలో ప‌ది పాత్ర‌లు చేసిన‌ప్పుడు కూడా - పొర‌పాటున ఒక పాత్ర‌కి ఎక్కువ ఇంకో పాత్ర‌కి త‌క్కువ చేయలేదు. `ఈ సీనులో క‌మ‌ల్ ఎగ‌స్ట్రాగా యాక్ట్ చేశాడు` అని వేలెత్తి చూపించి, ఆ లోపాన్ని ఎత్తి చూపించినందుకు మురిసిపోయే ఛాన్సెక్క‌డ ఇచ్చాడు గ‌నుక‌. `ఇక్క‌డ ఇంకాస్త న‌టించాల్సింది` అని ఎత్తిపొడిచే అవ‌కాశం ఎ ప్పుడిచ్చాడు గ‌నుక‌...?? అందుకే క‌మ‌ల్ హాస‌న్ మాకు న‌చ్చ‌లేదు, న‌చ్చ‌లేదు... న‌చ్చ‌లేదు.

పోనీ త‌న సినిమాలో ప‌నిచేద్దామంటే... క‌థ రాసేస్తాడు, పాట‌లు పాడేస్తాడు, రైట‌రు లేట్ అయితే ఆ పాటా తానే రాసేస్తాడు. మాట‌లు అల్లేస్తాడు. మెగా ఫోన్ ప‌ట్టుకొని డైరెక్ష‌నూ చేసేస్తాడు. మిగ‌తావాళ్ల‌కి ప‌నివ్వ‌డా, ఎద‌గ‌నివ్వ‌డా?? అందుకే న‌చ్చ‌లేదంతే!

కాస్త అమాయ‌కంగా యాక్ట్ చేయాలంటే - స్వాతి ముత్యం చూడాలి
ముస‌లి క్యారెక్ట‌ర్ ఇస్తే - భార‌తీయుడు డీవీడీ పెట్టుకోవాలి
మ‌రుగుజ్జు గుర్తొస్తే - విచిత్ర‌సోద‌రులు త‌ప్ప ఇంకో దిక్కులేదు
మాట‌ల్లేని సినిమాకి - పుష్ష‌క విమాన‌మే దిక్చూచీ!
మ‌న‌కు ఇంకో యాక్ట‌ర్ లేడా?? న‌ట‌న అనే పుస్త‌కంలో అన్ని పేజీలూ త‌న‌వేనా?? - నాన్సెన్స్‌, ఇందుకు మేం ఒప్పుకోం!

తెర‌పై తాను ఏడుస్తుంటే - మన‌కు ఎక్కిళ్లొస్తాయి.
తాను గెంతితే - కుర్చీలో కుదుపులు మొద‌ల‌వుతాయి.
న‌వ్వితే - మ‌న‌మూ కేరితంలు కొడ‌తాం
భ‌య‌ప‌డితే - ఉత్కంఠ‌త‌తో గోళ్లు గిళ్లుకొంటాం - మ‌న‌కెందుకీ టార్చ‌ర్‌! తానేం చేస్తే మ‌నం అది చేయాలా? మ‌న‌ల్ని వ‌ద‌ల్డా??
అందుకే క‌మ‌ల్ హాస‌న్ న‌చ్చ‌లేదు, న‌చ్చ‌లేదు, న‌చ్చ‌లేదు.

అరె అవార్డుల‌న్నీ త‌న‌కేనా, మిగిలిన వాళ్లకు ఇవ్వ‌రా?
హ‌మ్మ‌య్య ఆస్కార్ అందుకొనే ఛాన్స్ భార‌తీయుల‌కు లేదు గ‌నుక‌.... అది బ‌తికి పోయింది.
లేదంటే ప్ర‌తీసారి చెన్నై వ‌చ్చి, క‌మ‌ల్ చేతిలో వాలిపోయేది. త‌న‌కెంత ఖ‌ర్చు మిగిలిపోయిందో.
క‌మ‌ల్ సినిమా చూసొస్తే స‌రిపోదు ... అత‌న్ని థియేట‌ర్ ద‌గ్గ‌రే వ‌ద‌ల‌కుండా మ‌న‌తో పాటు తీసుకొచ్చేయాలి, ఆ పాత్ర‌తో స్నేహం చేయాలి, మ‌న‌సులో ఆ ఫొటో పెట్టుకొని, ఘ‌ట్టిగా ముద్రించేసుకోవాలి - సినిమా చూడ్డ‌మే ఎక్కువ‌నుకొంటే ఇన్ని చేయాలా - కుద‌ర్దు. అందుకే క‌మ‌ల్ న‌చ్చ‌డు గాక న‌చ్చ‌డు.

క‌మ‌ల్ క‌నిపిస్తే గుండె ఉప్పొంగిపోవ‌డాలూ, మ‌న‌సు ప‌రిత‌పించ‌డాలూ, ఆ న‌ట‌న‌నే మ‌న‌నం చేసుకోవ‌డాలూ ఎందుకీ ఖ‌ర్మ మ‌న‌కు..? త‌నేమైనా దేవుడా...? ఏమో, కావ‌చ్చు. దేవుడి పాత్ర ఇచ్చి `జ‌స్ట్.. ఉత్తుత్తిగా యాక్ట్ చేయండి` అని ఇచ్చినా దేవుడికే డౌటొచ్చేలా న‌టించేయ‌గ‌ల‌డు. బ‌హుశా నేనేనేమో, క‌మ‌ల్‌లో ఉన్నానేమో అని షాక్ తినేలా చేయ‌ల‌గ‌డు. వీడు మామూలోడా, మాయ‌గాడు. కోటాను కోట్ల ప్రేక్ష‌కుల్నే మంత్రం వేసి, వ‌శం చేసుకొన్నాడు, తన ఇష్టం వ‌చ్చిన‌ట్ట‌ల్లా ఆడించాడు, పాడించాడు, శాశించాడు. దేవుడో లెఖ్ఱా?? అందుకే క‌మ‌ల్ మాకు న‌చ్చ‌లేదు, న‌చ్చ‌లేదు... న‌చ్చ‌లేదు!!

(క‌మ‌ల్ హాస‌న్‌ని పొగ‌డ్డానికి మ‌న‌సొచ్చినా మాట‌లు మాత్రం రావ‌డం లేదు. అత‌నో హిమాల‌యం. ఏ మాట‌ల్తో కీర్తించాలి? ఎలా పొగ‌డాలి? అందుకే ఇలా సైడ్ ట్రాక్ ఎక్కాం. ఏమీ అనుకోకండేమ్‌..)
ఈరోజు క‌మ‌ల్ హాస‌న్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా..

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.