English | Telugu

నందమూరి వారి పటాస్‌

అతనొక్కడే’ నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘పటాస్‌’. సాయికార్తిక్‌ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జనవరి 1న నూతన సంవత్సరం కానుకగా హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో జరిగింది. థియేట్రికల్‌ ట్రైలర్‌ను డైనమిక్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌, కిక్‌ సురేందర్‌రెడ్డి విడుదల చేశారు. బిగ్‌ సీడీని యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మాస్‌ మహారాజా రవితేజ ఆవిష్కరించారు. ఆడియో సీడీలను యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఆవిష్కరించి తొలి సీడీని మాస్‌ మహారాజా రవితేజకి అందించారు.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడుతూ - ‘‘మా సంస్థలో వస్తున్న సినిమా ఇది. ఈ వేడుకకి అతిథిగా కాకుండా నందమూరి తారక రామారావుగారి మనవడిగా, నందమూరి కళ్యాణ్‌రామ్‌ తమ్ముడిగా ఈ వేడుకకి వచ్చాను. ఈ స్టేజీపై జానకిరాం అన్నయ్య ఉండుంటే చాలా బావుండేది. మేమిద్దరం ఇలా ఒకే స్టేజిపై కలిసి మాట్లాడాలనేది ఆయన కల. మా తాతగారి ఆశీస్సులు, జానకిరామ అన్నయ్య ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. నాకు నా ఇద్దరన్నయ్యలే ఇన్సిపిరేషన్‌. ఏం బతికారురా అనే కంటే ఏం బతికారురా అనేలా బతకాలని ఉండే విధంగా ఉండాలనే విషయాన్ని నేను ఫాలో అవుతున్నాను. ఆయన చెయ్యి ఎప్పుడూ పైన ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం అన్నయ్య కళ్యాణ్‌రామ్‌ కృషే కారణం. ఆయన అజాత శత్రువుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆనాడు రౌడీ ఇన్సెపెక్టర్‌ ఎంత పెద్ద సెన్సేషనల్‌ హిట్టయిందోఈ సినిమా కూడా అంతే పెద్ద సెన్సేషనల్‌ హిట్‌ కావాలి. 2015 సంవత్సరంలో గ్రేట్‌ ఇయర్‌ను ఈ చిత్రం ద్వారా ఆన్నయ్య స్టార్ట్‌ చేస్తున్నారు. ఈ ఇయర్‌పై మా పేరు ఉండాలని ఆశిస్తున్నాను. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

మాస్‌ మహారాజా రవితేజ మాట్లాడుతూ - ‘‘పటాస్‌ ట్రైలర్స్‌, పాటలు చాలా బావున్నాయి. సాయికార్తిక్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. అనిల్‌ ఎక్సలెంట్‌ డైరెక్షన్‌ చేశాడు. తనకి ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుంది. తను నెక్స్‌ట్‌ సినిమాకి రెడీ అయిపోవచ్చు. కల్యాణ్‌రామ్‌గారి బ్యానర్‌లో ప్రస్తుతం కిక్‌2 సినిమా చేస్తున్నాను. కళ్యాణ్‌రామ్‌ గురించి బాగా ఆర్థం చేసుకున్నాను. ఆయన బంగారం లాంటి వ్యక్తి. ఈ సినిమా పెద్ద హిట్టయి టీమ్‌ అందరికీ మంచి పేరు, నిర్మాతకి మంచి లాభాలను తీసుకురావాలి’’ అన్నారు.

చిత్ర నిర్మాత, హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ - ‘‘రవితేజ, పూరిజగన్నాథ్‌, సురేందర్‌రెడ్డి సహా బి.గోపాల్‌గారు అందరూ ఈ వేడుకకి రావడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ థాంక్స్‌. ఎన్టీఆర్‌ నా తమ్ముడే కాబట్టి తనకి థాంక్స్‌ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సినిమా విడుదలైన తర్వాతే మాట్లాడుతాను’’ అన్నారు.

డైనమిక్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ - ‘‘నందమూరి కల్యాణ్‌రామ్‌గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటాను. ఓ సందర్భంలో నాగార్జునగారు నాతో మాట్లాడుతూ ఈ మధ్య నేను కల్యాణ్‌రామ్‌ని కలిశాను. చాలా పద్ధతైన మనిషి అని అన్నారు. ఒక మనిషిని నమ్మితే జీవితాంతం ఆ వ్యక్తిని కల్యాణ్‌రామ్‌గారు ప్రేమిస్తారని, మాటపైన నిలబడే వ్యక్తి అని, స్నేహానికి చాలా విలువనిస్తారని ఆయనతో ఉన్న వాళ్లు కూడా ఆయన గురించి ఇలా చాలా విషయాలు చెప్పారు. ట్రైలర్స్‌, సాంగ్స్‌ చాలా బావున్నాయి. అనిల్‌ తన తొలి సినిమాతోనే తనెంటో ప్రూవ్‌ చేసుకుంటున్నాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. యూనిట్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

కిక్‌ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ - ‘‘ఎన్టీఆర్‌తో, కల్యాణ్‌రామ్‌తో నాకు మంచి రిలేషన్‌ ఉంది. 2015 సంవత్సరం కల్యాణ్‌రామ్‌గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అయి నిర్మాతగా, హీరోగా మంచి పేరు తీసుకువస్తుంది. ట్రైలర్‌, సాంగ్స్‌ చాలా బావున్నాయి. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌ స్టయిల్‌ తెలుస్తుంది. సాయికార్తిక్‌ మంచి సంగీతం, బ్యాగ్రౌండ్‌స్కోర్‌ ఇచ్చాడు. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

చిత్ర దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ - ‘‘నేను ఈ స్టేజ్‌లోకి రావడానికి చాలా మంది సపోర్ట్‌ చేశారు. ముఖ్యంగా నా తల్లిదండ్రులు, సిస్టర్‌కి థాంక్స్‌. అలాగే మా బాబాయి అరుణ్‌ప్రసాద్‌ కారణంగా నేను ఇండస్ట్రీలోకి సులభంగా రాగలిగాను. ఆయనకి కూడా థాంక్స్‌. ఆది సినిమా చూసిన నేను చేస్తే ఇలాంటి కమర్షియల్‌ సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యాను. అలాగే ఈ కథను తయారు చేసుకున్న తర్వాత రెండేళ్లు వెయిట్‌ చేశాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి నందమూరి కళ్యాణ్‌రామ్‌గారే కారణం. కొత్త కల్యాణ్‌రామ్‌ని చూస్తారు. నందమూరి అభిమానులకు ఈ సినిమా ఫీస్ట్‌ అవుతుంది’’ అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .