English | Telugu

కాజల్ అందరికి షాకిచ్చింది..!

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న 'సమంత' కి ఇప్పుడు షాక్ తగిలింది. ఏం మాయ చేసావే'..సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులు పడేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోలను పడేస్తూ.. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్ టాప్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే సమంత ఇప్పుడు సడన్ గా సెకండ్ ప్లేస్ కి పడిపోయింది. అది ఎలాగా అంటారా? సౌత్‌లో ఓ ప్రముఖ పత్రిక టాప్ హీరోయిన్ ఎవరనే దానిపై ఆన్‌లైన్ సర్వే చేపట్టింది. ఈసర్వేలో అందరికి షాకిచ్చేలా కాజల్‌ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోంది. దీంతో ఇండస్ట్రీలో అందరూ దీనిపైనే చర్చిస్తున్నారు. టాప్‌లో వున్న సమంతకి ఈసర్వే లో సెకెండ్ ప్లేస్ రావడం, శృతిహాసన్ కి మూడో స్థానం దక్కడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.