English | Telugu

బికినిలో షాకిచ్చిన సమంత

టాలీవుడ్ లక్కీ గర్ల్ సమంత నిన్న రిలీజైన సూర్య సికిందర్ మూవీలో బికినీలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో సమంత బికినీలో కనిపిస్తుందని వార్తలు వచ్చిన అవన్ని పుకార్లు అనుకొని కొట్టిపారేశారు. నమ్మలేం అంటున్న వాళ్ళని సమంత బికినిలో దర్శనమిచ్చి నమ్మేలా చేసింది. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సమంత స్లిమ్ ఫిగర్ అందాలు చూసి అభిమానులు పండగ చేసుకొంటుంటే, ఆమెకి నిరాశే ఎదురయ్యింది. ఎందుకంటే నిన్న రిలీజైన సికిందర్ తో కలిపి మొత్తం వరుసగా తమిళ్ లో ఐదు ఫ్లాప్ లను మూటగట్టుకుంది. తమిళ్ లో సమంత ఫేట్ ఎప్పటికి మారుతుందో!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.