English | Telugu

ఐటం గర్ల్‌గా కాజల్ కొత్త అవతారం

టాలీవుడ్ టాప్ హీరోయిన్లు ఐటం సాంగ్స్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో కనిపించడం పరిపాటిగా మారింది. ఫెవికాల్ సాంగ్ లో కరీనా , చిక్నీ చమేలీ పాటలో కత్రీనా, కజ్రారే సాంగ్ లో ఐశ్వర్య రాయ్ ఇలా స్పెషల్ అపియరెన్సులు ఇచ్చారు. ఆ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ లోనూ కనిపిస్తోంది. తమన్నా అల్లుడు శీను సినిమాలో ఐటం గర్ల్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. శృతి, సమంతలు కూడా ఈ జాబితాలో చేరారు. ఇప్పుడు తాజాగా కాజల్ కూడా ఒక ఐటం నంబర్ చెయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంజలీ హీరోయిన్ గా నటిస్తున్న గీతాంజలి సినిమాలో కాజల్ ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించే అవకాశం వుందట.

కెరీర్ సరిగ్గా నడవనప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్లు ఐటం నెంబర్లు చేసి మళ్లీ అవకాశాలు దక్కించుకుంటుంటారు. బహుశా కాజల్ కూడా ఇదే దారి సరైందని అనుకుంటుందేమో. తెలుగులో కాజల్ కి 2 సినిమాలు తప్ప పెద్దగా అవకాశాలు లేవనే చెప్పాలి. అందుకే ఐటం సాంగ్ తో కొత్త క్రేజ్ సంపాదించుకోవడానికి కాజల్ ఈ ప్రయత్నం చేయడం ఎంతైనా సబబే. ఒక్క సాంగ్ చేసినా సినిమాకు వచ్చేంత రెమ్యునరేషన్ తో పాటు, ఫ్రెష్ ఇమేజ్ కూడా వస్తుండటంతో తారలు ఈ పాటల్లో కనిపించడానికి వెనకాడట్లేదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.