English | Telugu

ఒకరోజు లేటుగా రానున్న 'ఐస్‌క్రీమ్‌'


'ఐస్‌క్రీమ్‌' కోసం ఇంకా వెయిటింగ్ తప్పదు. ఎంతగానో ఊరిస్తున్న రామ్‌గోపాల్‌వర్మ చిత్రం 'ఐస్‌క్రీమ్‌' విడుదల ఒకరోజు లేటుకానుందట. 'ఐస్‌క్రీమ్‌' చిత్రం ఈ నెల 11న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే సినిమా విడుదల తేదీ మారినట్లు సమాచారం. ప్రకటించిన తేదీకి ఒక రోజు లేటుగా, అంటే 12 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట. నవదీప్, తేజస్వీ జంటగా నటిస్తున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ఏ సర్టిఫికేట్ పొందింది. చిత్రం విడుదల ఆలస్యానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ట్రెయిలర్ విడుదలయినప్పటి నుంచి వారవారం ఒక మీడియా సమావేశం నిర్వహిస్తూ, చిత్రానికి మంచి హైప్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఫ్లో కాం టెక్నాలజీ, తేజస్వి గ్లామర్, ఆర్ జీ వి దర్శకత్వం ఈ విషయాలు ఆల్ రెడీ ప్రేక్షకులలో అంచనాలను పెంచేశాయని చెప్పవచ్చు.



పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.