English | Telugu

అదరహో అనిపిస్తున్న ఉత్తమ విలన్ ట్రెయిలర్


ఉత్తమ విలన్ ట్రెయిలర్ తమిళ చిత్రసీమకు సంబంధించిన ఒక ఫంక్షన్ లో విడుదలైంది. ఈ ట్రెయిలర్ ఆన్‌లైన్ లో చూసిన వారంతా అబ్బురపడిపోతున్నారు. ఎర్రటి రంగు మాస్క్ తో మొదలై వివిధ రకాల ఆకృతులతో ఆకట్టుకునేలా రూపొందింది ఈ ట్రెయిలర్. మృత్యుంజయ అనే బ్యాక్ గ్రౌండ్ పాటతో సాగుతున్న ఈ ట్రెయిలర్ లో దర్శకులు బాలచందర్, విశ్వనాథ్ లు కూడా కనిపించటం ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఉత్తమ విలన్ అనే చిత్ర టైటిల్ లాగే సినిమా ట్రైలర్ కూడా విలక్షణంగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో ఆండ్రియా, ఊర్వశి, పూజాకుమార్ తదితరులు నటిస్తున్నారు. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు.


కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.