English | Telugu
ఆ హీరోని ఎందుకు పెళ్లి చేసుకున్నాను..
Updated : Oct 19, 2023
కొంత మంది నటులు పర బాషానటులైనా కూడా అచ్చం మన తెలుగు నటులు లాగానే అనిపిస్తారు. అదేమి విచిత్రమేమో గాని పరభాషకి చెందిన ఆ హీరో, హీరోయిన్ ఇద్దరు తెలుగు లో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ హీరో హీరోయిన్ ఎవరో కాదు సూర్య అండ్ జ్యోతిక. తాజాగా జ్యోతిక తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో సూర్యని ఎందుకు ప్రేమించింది,పెళ్లిచేసుకోవలసి వచ్చిందో చెప్పింది.
సూర్య, జ్యోతిక ఇద్దరు కలిసి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమా ల్లో నటించారు. సూర్య సినిమాల్లోకి రావడానికి ముందు నుంచే జ్యోతిక సినిమాలు చేస్తూ ఉంది. సూర్య కంటే జ్యోతిక సినిమా ఇండస్ట్రీ లో బాగా సీనియర్. సూర్యకి అప్పుడప్పుడే చిన్నగా సినిమా లు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జ్యోతిక అప్పటికే పెద్ద హీరోయిన్ రేంజ్ లో ఉంది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి పువెళ్లమ్ కెట్టుప్పర్ అనే సినిమాలో తొలిసారిగా నటించారు. అప్పుడే వాళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. కానీ ఒకరికి ఒకరు చెప్పుకోలేదు. ఆ తర్వాత ఇద్దరు కలిసి సుమారు ఏడు చిత్రాల దాకా చేసారు. ఒక రోజున సూర్య జ్యోతికకు తన ప్రేమ విషయం చెప్పడంతో జ్యోతిక ఒప్పుకొని తన ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు కూడా ఒప్పుకోవడం, వెంటనే పెళ్లి జరగడం జరిగిపోయింది. ఈ తతంగమంతా కేవలం నెల రోజుల్లోనే జరిగింది. ఈ విషయాలన్నీ స్వయంగా జ్యోతికే చెప్పింది.
అలాగే తాను ఎందుకు సూర్య ప్రేమలో పడిపోయాననే విషయాన్ని కూడా జ్యోతిక చెప్పింది. సూర్య ఒక సినిమా లో హీరోయిన్ తో రొమాన్స్ సీన్ చేయాలసివచ్చినప్పుడు డైరెక్టర్ ఎంతవరకు చెప్తే అంత వరకే చేస్తాడు. అంతే కానీ ఎక్సట్రా గా నటించాడు.పైగా ఆ సన్నివేశాలప్పుడు హీరోయిన్ గా చేసే అమ్మాయికి సూర్య చాలా గౌరవం ఇస్తాడని అందుకే సూర్య ప్రేమలో పడిపోయి పెళ్లంటూ చేసుకుంటే సూర్యనే చేసుకోవాలని అనుకున్నానని చెప్పింది. పైగా ఇప్పటికి చాలా మంది ఆడవాళ్లు తమ భర్తలకి సూర్య ని చూసి నేర్చుకోమని చెప్పటం కూడా నేను చాలా సార్లు చూశానని ఎందుకంటే తన భార్యగా సూర్య నాకు చాలా గౌరవం ఇస్తాడని ఇదే విషయాన్నీ ఆడవాళ్లు తమ భర్తలకు చెప్తారని అని చెప్పింది.