English | Telugu

శ్వేతాబ‌సు క‌థే... జ్యోతిల‌క్ష్మి?

టాలీవుడ్‌లో శ్వేతాబ‌సు ప్ర‌సాద్ వ్య‌వ‌హారం సంచ‌ల‌నం సృష్టించింది. క‌థానాయిక‌ల చీక‌టి భాగోతాల‌ను బ‌య‌ట‌పెట్టిన ఉదంతం అది. శ్వేత‌పై జాలిచూపిన‌వాళ్లు కొంద‌రైతే - ఆమె క‌థ‌ని క్యాష్ చేసుకొనేవాళ్లు మ‌రికొంద‌రు. ఇప్పుడు పూరి జ‌గ‌న్నాథ్ ఆ ప్ర‌య‌త్న‌మే చేస్తున్న‌ట్టు టాక్‌. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం జ్యోతిల‌క్ష్మి. ఛార్మి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ క‌థ కూడా చీక‌టి బాగోతాల వ్య‌ధేన‌ట‌. ముఖ్యంగా శ్వేతాబ‌సు ప్ర‌సాద్ ఉదంతం చుట్టూ పూరి ఈ క‌థ న‌డుపుతున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. నిర్మాత సి.కల్యాణ్ ఇస్తున్న స్టేట్‌మెంట్లూ ఈవాద‌న‌ని బ‌ల‌ప‌రుస్తున్నాయి. ''ఇటీవ‌ల టాలీవుడ్‌లో జ‌రిగిన ఓ సంచ‌న‌ల‌నాత్మ‌క వ్య‌వ‌హారాన్ని పూరి త‌న‌దైన కోణంలో ఆవిష్క‌రిస్తాడు'' అంటున్నారాయ‌న‌. దాన్ని బ‌ట్టి అది శ్వేతాబ‌సు మేట‌రే అన్న అనుమానం క‌లుగుతోంది. మ‌రి పూరి జ్యోతిల‌క్ష్మి డీల్ చేసే ఆ డేంజ‌రెస్ పాయింటేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాలి.