English | Telugu

బుడ్డోడి సినిమాకి బ‌డా షాక్‌

వ‌రుస ఫ్లాపుల‌తో ఎన్టీఆర్ ఇమేజ్‌కి డామేజీ వ‌చ్చేసింది. రామ‌య్యా వ‌స్తావ‌య్యా, ర‌భ‌స‌.. సినిమాలు ఎన్టీఆర్ స్టార్‌డ‌మ్‌ని మ‌రింత కింద‌కు లాగేశాయి. ఈ ఎఫెక్ట్ టెంప‌ర్‌పై భారీగా ప‌డ‌బోతోంది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న టెంప‌ర్ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. టెంప‌ర్‌కి సంబంధించిన బిజినెస్ కూడా మొద‌లైపోయింది. అయితే వ‌స్తున్న రేట్లు చూస్తే.. పూరి అండ్ కోకి దిమ్మ‌తిరిగిపోతోంద‌ట‌. నైజంలో రూ.9 కోట్ల‌కు అడుగుతున్నార్ట‌. అంత‌కు మించి ఒక్క‌పైసా కూడా ఈ సినిమాపై పెట్ట‌లేమ‌ని బ‌య్య‌ర్లు చెబుతున్నార్ట‌. ఓవ‌ర్సీస్‌కి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి ఆఫ‌ర్లూ రాలేదు. దాంతో నిర్మాత బండ్ల గ‌ణేష్‌కి చుక్కలు క‌నిపిస్తున్నాయ‌ని తెలిసింది. ఈ సినిమాని ఏదో ఓ రేటుకి ముందుస్తుగానే అమ్మేయాల‌ని చిత్ర‌బృందం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఎన్టీఆర్ సినిమాకి ఇది వ‌ర‌క‌టిలా భారీ రేట్లు రావ‌ని గ్ర‌హించిన పూరి... టెంప‌ర్ సినిమాని త‌క్కువ బ‌డ్జెట్‌లోనే ముగించాల‌ని చూస్తున్నాడ‌ట‌. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బ‌డ్జెట్ రూ.30 కోట్లు దాట‌కూడ‌ద‌ని.. పూరి భావిస్తున్నాడ‌ట‌. అందుకే అన‌వ‌స‌ర‌మైన హంగామాకు చోటివ్వ‌కుండా రూ.30లో సినిమాని చుట్టేద్దామ‌నుకొంటున్నాడ‌ట‌. అలాంట‌ప్పుడు త‌క్కువ రేట్లకి ఈ సినిమాని అమ్ముకొన్నా బ‌య్య‌ర్లు, నిర్మాత ఇద్ద‌రూ సేఫ్ అవుతార‌ని స్కెచ్ వేశాడు పూరి. మ‌రి టెంప‌ర్‌.. టెంపో ఎంతో...?? బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఎన్టీఆర్ సినిమా ఎంత వ‌సూలు చేస్తుందో ప్రేక్ష‌కులే చెప్పాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.