English | Telugu

అల్లు అర్జున్ పై 'అతి'నమ్మకమా..!!

అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల సినిమా బిజినెస్ హాట్ కేక్ లా సాగిపోతుందట. ఏ ఏరియాకి బిజినెస్‌ ఎప్పుడూ ఓపెన్ చేస్తారని బయ్యర్లు కాచుకొని కుచ్చున్నారట. రీసెంట్ గా కొన్ని ఏరియాల బిజినెస్‌ ఓపెన్ చేస్తే వాటికి నిర్మాత కూడా వూహించని రెంజులో ఆఫర్లు వచ్చాయట. నైజాంని దిల్ రాజు పధ్నాలుగు కోట్లకి నాన్‌ రిఫండబుల్‌ పద్ధతిలో తీసుకున్నాడట. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే మిగతా ఏరియాల బిజినెస్ కూడా ఇదే రెంజులో వెళ్ళాయట. కానీ ఒక్క చిత్రం సూపర్ హిట్ కాగానే బయ్యర్లు మళ్ళీ అదే రిపీట్ అవుతుందనే ఆశలో హెవీగా ఇన్వెస్ట్‌ చేయడం అంత లాభదాయకం కాదని సినీ విమర్శకులు అంటున్నారు. అగ్ర శ్రేణి హీరోల తర్వాతి శ్రేణి హీరోగా వుండే అల్లు అర్జున్ పై అంత నమ్మకం పనికిరాదని అంటున్నారు. ఈ చిత్రానికి జరుగుతోన్న బిజినెస్‌కి అందరూ లాభపడలంటే బన్నీ బ్లాక్‌బస్టర్‌ ఇవ్వాలి లేదంటే బయ్యర్లను గట్టెక్కించే సీన్ ఆయనకి వుందా అనేది ఆలోచించాలి!

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.