English | Telugu

వార్-2 ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)కు వాచ్ లు అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. కోట్ల విలువ చేసే ఖరీదైన వాచ్ లను ఆయన ధరిస్తూ ఉంటారు. ఏదైనా ఈవెంట్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారంటే చాలు.. ఆయన ధరించిన వాచ్ గురించి, దాని ధర గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. తాజాగా వార్-2 ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ వాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

'వార్-2'తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. 'వార్-2'పై ఎన్టీఆర్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డబుల్ కాలర్ ఎగరేసి మరీ.. ఈ సినిమా అదిరిపోతుందని అభిమానులకు భరోసా ఇచ్చారు. ఇక ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ కాలర్ ఎత్తడం ఎంత హైలైట్ అయిందో.. ఆయన ధరించిన వాచ్ కూడా అదే స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది.

ఎన్టీఆర్ ఖరీదైన వాచ్ లు ధరిస్తారని ఇప్పటికే అందరికీ అవగాహన ఉండటంతో.. ఆ వాచ్ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇది 'ఆడెమర్స్ పిగెట్' అనే బ్రాండ్ కి చెందినది. ప్రపంచంలో లగ్జరీ వాచ్ లను తయారు చేసే టాప్ బ్రాండ్స్ లో ఆడెమర్స్ పిగెట్ ఒకటి. లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ వాచ్ లకు ఇది పెట్టింది పేరు. అందుకే వాటి ధర ఎక్కువగా ఉంటాయి.

ఇక వార్-2 ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర.. దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వాచ్ ధర సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని లగ్జరీ కార్ల కంటే కూడా ఈ వాచ్ ధర ఎక్కువగా ఉందని నెటిజెన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా కొందరైతే.. ఆ డబ్బులతో చిన్న సినిమా కూడా తీయొచ్చని అంటున్నారు.

ఎన్టీఆర్ ఇలా కోట్ల విలువైన వాచ్ లతో పలు ఈవెంట్లలో కనిపించారు. దీంతో అసలు ఆయన దగ్గర ఇలాంటి ఖరీదైన వాచ్ లు ఎన్ని ఉన్నాయని అభిమానులు చర్చించుకుంటున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.