English | Telugu

యన్ టి ఆర్ తో నటించను - ఇలియానా

"యన్ టి ఆర్ తో నటించను" అని ఇలియానా అన్నదట. వివరాల్లోకి వెళితే నలక నడుము గోవా భామ ఇలియానా గతంలో "రాఖీ" చిత్రంలో హీరోయిన్ గా యన్ టి ఆర్ సరసన, కృష్ణ వంశీ దర్శకత్వంలో నటించింది. అనంతరం వైజయమతీ మూవీస్ పతాకంపై, యన్ టి ఆర్ సరసన, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, అశ్వనీదత్ నిర్మించిన "శక్తి" చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ ఫ్లాపయ్యింది. అది వేరే విషయం అనుకోండి.

ఈ "శక్తి" చిత్రం ప్రమోషన్ కోసం ఇలియానాని నిర్మాత అశ్వనీదత్ కోరగా పబ్లిసిటీకి రాకపోగా "అయిపోయిన పెళ్ళికి బాజాలన్నట్లు... ఫ్లాపయిన సినిమాకి పబ్లిసిటీ ఒకటా" అని వెటకారంగా అందట. దాంతో౦ నిర్మాత ఫిలిం ఛాంబర్లో ఆమె మీద కంప్లాయంట్ చెయ్యటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వచ్చి ఇష్టం లేని మొగుడితో కాపురం చేసే పెళ్ళాంలా ఆ చిత్రం పబ్లిసిటీలో పాల్గొంది. ఆ సమయంలో "ఇక ఈ జన్మలో యన్ టి ఆర్ తో నటించను" అని కూడా అందట. "శక్తి" షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఏవో అభిప్రాయ భేదాలొచ్చాయట. అంతే కాక ఇలియానాకు ఇష్టం లేదని తెలిసి యన్ టి ఆర్ కావాలనే ఆమె ముందు సిగిరెట్లు తాగేవాడట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.