English | Telugu

ఆగస్ట్‌ 29న‘రభస'.. ఏనీ డౌట్స్

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ‘కందిరీగ’ ఫేం సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో యువనిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం ‘రభస’. ఈ చిత్రం ఆగస్ట్‌ 29న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ - ‘‘ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో చాలా పెద్ద హిట్‌ అయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాడిన ‘రాకాసి రాకాసి’ ఈ ఆడియోకి హైలైట్‌ సాంగ్‌గా నిలిచింది. త్వరలోనే ఈ చిత్రం ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ చేయబోతున్నాం. ఆదిలాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత మా లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌ బేనర్‌లో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌తో చేస్తున్న ఈ చిత్రం అభిమానుల్ని, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆగస్ట్‌ 29న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఎన్టీఆర్‌ కెరీర్‌లో, మా బేనర్‌లో ఇది సెన్సేషనల్‌ హిట్‌ సినిమా అవుతుంది’’ అన్నారు.

టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ మాట్లాడుతూ - ‘‘యూత్‌ఫుల్‌, మాస్‌, ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘రభస’ ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. ఎన్టీఆర్‌ ‘రభస’లో పక్కా మాస్‌ లుక్‌తో వుంటారు, యూత్‌ఫుల్‌ స్టైల్‌లో వుంటారు, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా వుంటారు. ఎన్టీఆర్‌ ఈ మూడు జోన్స్‌ని టార్గెట్‌ చేసి తీస్తున్న సినిమా ‘రభస’. రెండున్నర గంటలసేపు ఫ్యామిలీ మెంబర్స్‌ అందరూ కలిసి చూసి ఎంజాయ్‌ చేసి అందరూ అయిదార్లుసార్లు చూసేంత ఎంటర్‌టైనింగ్‌గా వుంటుంది. బెల్లంకొండ సురేష్‌గారి రేంజ్‌ మేకింగ్‌లో ఈ సినిమాలో కనిపిస్తుంది’’ అన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.