English | Telugu
కళ్ళు చెదిరేలా ఎన్టీఆర్ లైనప్!
Updated : Oct 5, 2023
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన లైనప్ తో కళ్ళు చెదిరేలా చేస్తున్నాడు. 'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. వరుస క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'దేవర' చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక బాలీవుడ్ బిగ్ ఫిల్మ్ 'వార్-2'లో నటించనున్నాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఈ మూవీలో హృతిక రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించనున్నాడు. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇక 'వార్-2' తర్వాత 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. పైగా ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అన్నట్టుగా గతంలో ప్రశాంత్ నీల్ తెలిపాడు.
దేవర మూవీ రెండు భాగాలుగా రానుందని తాజాగా ప్రకటించారు. మొదటి భాగం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇక రెండో భాగం 'వార్-2', ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లు పూర్తయ్యాక సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది అంటున్నారు. 'దేవర-2' పూర్తి అయ్యాక స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ సోలో మూవీ ఒకటి ఉంటుందట. అది అవగానే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పార్ట్-2 మొదలవుతుందట. 'దేవర', 'వార్-2', ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, 'దేవర-2', స్పై యూనివర్స్ సోలో ఫిల్మ్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పార్ట్-2 ఇలా వరుస క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో కళ్ళు చెదిరేలా ఎన్టీఆర్ లైనప్ ఉంది.