English | Telugu

'ఎన్టీఆర్ 30'.. మార్చి 6న సర్ ప్రైజ్!

'ఎన్టీఆర్ 30' మూవీ ఎప్పుడెప్పుడా మొదలవుతుందా అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ మూవీ ఫిబ్రవరి 24నే లాంచ్ కావాల్సి ఉంది. కానీ తారకరత్న మృతితో వాయిదా పడింది. అయితే మార్చిలో ఈ సినిమాకి సంబంధించి వరుస సర్ ప్రైజ్ లు రాబోతున్నాయి.

'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న 'ఎన్టీఆర్ 30'పై భారీ అంచనాలు ఉన్నాయి. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ఖరారయ్యారు. ఇప్పటికే లుక్ టెస్ట్ కోసం జాన్వీ కపూర్ ఫోటో షూట్ కూడా జరిగింది. ఇదిలా ఉంటే మార్చి 6న జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె 'ఎన్టీఆర్ 30'లో నటిస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ప్రీలుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అలాగే మార్చి 17 లేదా 18న పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ఘనంగా ప్రారంభించనున్నారని, మార్చి 20 నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలని భావిస్తున్నారట.