English | Telugu
'భోళా శంకర్' వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. రీఎంట్రీ ఇచ్చాక బాస్ కిదే వీకెస్ట్ ఓపెనింగ్!
Updated : Aug 12, 2023
మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం 'భోళా శంకర్'.. శుక్రవారం (ఆగస్టు 11) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదట్నుంచి పెద్దగా అంచనాలు లేని సినిమా అయినప్పటికీ.. మెగాస్టార్ కోసం జనాలు థియేటర్ల బాట పట్టారు. అయితే, టాక్ మరీ వీక్ గా ఉండడంతో టికెట్ విండోస్ వద్ద తొలిరోజే కాసుల గలగలలు అంతగా వినిపించలేదు. ఫలితంగానే.. రీఎంట్రీ ఇచ్చాక చిరు నుంచి వచ్చిన సినిమాల్లో వీకెస్ట్ మూవీగా 'భోళా శంకర్'గా నిలిచింది.
రీఎంట్రీ తరువాత వచ్చిన మెగాస్టార్ చిత్రాల పరంగా చూస్తే.. రూ. 85 కోట్ల గ్రాస్ తో 'సైరా నరసింహారెడ్డి' ఫస్ట్ డే సెన్సేషన్ క్రియేట్ చేయగా, రూ. 52 కోట్ల గ్రాస్ తో 'ఆచార్య' రెండో స్థానంలో నిలిచింది. ఇక రీఎంట్రీ మూవీ 'ఖైదీ నంబర్ 150' విషయానికి వస్తే.. రూ.50.10 కోట్ల గ్రాస్ తో మూడో స్థానంలో ఉంది. అలాగే మెగాస్టార్ ప్రీవియస్ బ్లాక్ బస్టర్ మూవీ 'వాల్తేరు వీరయ్య' రూ. 49. 10 కోట్ల గ్రాస్ తో నాలుగో స్థానంలోనూ, 'గాడ్ ఫాదర్' రూ. 32. 70 కోట్ల గ్రాస్ తో ఐదో స్థానంలోనూ ఉంది. 'భోళా శంకర్' విషయానికి వస్తే.. రూ. 28 కోట్ల గ్రాస్ తో ఆరో స్థానంలో నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా 'భోళా శంకర్' తొలి రోజు కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 4.51 కోట్ల షేర్
సీడెడ్: రూ. 2.02 కోట్ల షేర్ (32 లక్షల హైర్స్)
ఉత్తరాంధ్ర: రూ. 1.84 కోట్ల షేర్
ఈస్ట్ గోదావరి: రూ. 1.32 కోట్ల షేర్ (51 లక్షల హైర్స్)
వెస్ట్ గోదావరి: రూ. 1.85 కోట్ల షేర్ (1.25 కోట్ల హైర్స్)
గుంటూరు : రూ. 2.08 కోట్ల షేర్ (1.31 కోట్ల హైర్స్)
కృష్ణ: రూ. 1.03 కోట్ల షేర్ (32 లక్షల హైర్స్)
నెల్లూరు: రూ. 73 లక్షల షేర్ (29 లక్షల హైర్స్)
ఆంధ్ర, తెలంగాణ (తెలుగు రాష్ట్రాలు) మొత్తం కలెక్షన్స్ : రూ. 15.38 కోట్ల షేర్ (రూ. 22.20 కోట్ల గ్రాస్)(రూ. 4.5 కోట్ల హైర్స్)
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 1.05 కోట్ల షేర్
ఓవర్సీస్ : రూ. 1.95 కోట్ల షేర్
వరల్డ్ వైడ్ మొత్తం కలెక్షన్స్: రూ. 18.38 కోట్ల షేర్ (రూ 28.50 కోట్ల గ్రాస్)