English | Telugu
వహీదా రెహమాన్ కు బాలకృష్ణ శుభాకాంక్షలు!
Updated : Sep 27, 2023
ప్రముఖ బాలీవుడ్ నటి వహీదా రెహమాన్ ను భారత అత్యున్నత సినీ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన విషయం తెలిసిందే. భారత సినీ రంగానికి ఆమె అందించిన సేవలకుగానూ మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డుని ప్రకటించింది. దీంతో వహీదా రెహమాన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నటసింహం నందరి బాలకృష్ణ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
"భారతీయ సినీ చరిత్రలో వహీదా రెహమాన్ గారి ప్రయాణం ఒక చెరగని ముద్ర. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి, అత్యంత సహజంగా అభినయించే దిగ్గజ నటి వహీదా రెహమాన్ గారు. తెలుగు చిత్ర పరిశ్రమతో కూడా వారికి ఎంతో అనుబంధం వుంది. నాన్నగారి జయసింహ చిత్రంలో వహీదా రెహమాన్ గారు అద్భుతమైన పాత్ర పోషించారు. అపారమైన ప్రతిభతో మేటిగా ఎదిగిన వహీదా రెహమాన్ గారికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించడం ఆనందదాయకం. వహీదా రెహమాన్ గారికి నా శుభాకాంక్షలు" అన్నారు బాలకృష్ణ.