English | Telugu
సెంచ్యురీ క్లబ్ లో జగపతి బాబు
Updated : Apr 5, 2011
ఈ చిత్రాన్ని విశాఖ టాకీస్ పతాకంపై నట్టి కుమార్ నిర్మించనున్నారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇటీవల నట్టి కుమార్ నిర్మాతగా ఆ బ్యానర్ లోనే జగపతిబాబు హీరోగా, విమలా రామన్ హీరోయిన్ గా, అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన "చట్టం" చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.జగపతి బాబు నంటించబోయే వందవ చిత్రం చాలా భారీగా ఉండబోతుందని, ఈ చిత్రం 2011 ఆగస్టు నెలలో ప్రారంభం కావచ్చని అనుకుంటున్నారు. జగపతి బాబు హీరోగా నటించిన తొలి చిత్రం"అభిమన్యుడు".