English | Telugu

ఇతను కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండా?

కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది అంటూ కొద్దిరోజులు క్రితం వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. కీర్తి సురేష్ ప్రేమలో ఉందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఒకే ఒక్క ఫోటో. కీర్తి సురేష్ తన ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. అందులో ఇద్దరు ఒకే కలర్ దుస్తులు ధరించి, చాలా సన్నిహితంగా కనిపించారు. దీంతో అతను కీర్తి బాయ్ ఫ్రెండ్ అంటూ వార్తలు గుప్పుమన్నాయి.

కీర్తితో పాటు ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు ఫర్హాన్‌ బిన్ లియాఖత్. వీరిద్దరూ చిన్నతనం నుంచి మంచి స్నేహితులట. అయితే ఇటీవల తన చిన్ననాటి ఫ్రెండ్ ని కీర్తి పెళ్లి చేసుకోనుంది అంటూ వార్తలొచ్చాయి. ఇక తాజాగా ఫర్హాన్‌ పుట్టినరోజు సందర్భంగా "హ్యాపీ బర్త్ డే ఫర్హాన్‌" అని కీర్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. "థాంక్యూ కిట్టి" అంటూ అతను రిప్లై ఇచ్చాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసున్న ఫోటోని పోస్ట్ చేయగా.. అది అందరి దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలొస్తున్నాయి. అయితే అందులో వాస్తవం లేదని, వారిద్దరూ స్నేహితులు మాత్రమే అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.