English | Telugu
‘భగవంత్ కేసరి’ విషయంలోనూ అదే ఫార్ములానా?
Updated : Sep 22, 2023
‘పటాస్’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన అనిల్ రావిపూడి ఆ తర్వాత చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం విజయం సాధించినవే. అతని సినిమాలు ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణం కామెడీ సన్నివేశాలు. ప్రతి సినిమాలోనూ తనదైన శైలిలో కామెడీని జొప్పించి చిత్ర విజయానికి కారణమయ్యేందుకు ఎక్కువ కృషి చేస్తారు అనిల్. పటాస్ నుంచి ఎఫ్3 వరకు ప్రతి సినిమాలోనూ అదే ఫార్ములాతో వెళుతున్నారు అనిల్.
తాజాగా నందమూరి బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ చిత్రం చేస్తున్నారు అనిల్. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీల ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలోనూ తన మార్క్ కామెడీతోనే వెళుతున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ ఇమేజ్‌కి తగ్గట్టు పవర్‌ఫుల్ సీన్స్ ఉంటూనే కామెడీని కూడా ప్రధానం తీసుకొని ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి బాలకృష్ణతో ఈ ఫార్ములా ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.