English | Telugu
మమ్ముట్టి తల్లి కన్నుమూత
Updated : Apr 21, 2023
మలయాళ ఇండస్ట్రీలో విషాదం... గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్(93) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసారు. మమ్ముట్టి తల్లి మరణంతో మలయాళ చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఫాతిమా మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ వివిధ రంగాల ప్రముఖులు మమ్ముట్టి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.