English | Telugu

ముగింపు దశలో హ్రితిక్ దాంపత్యం

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ దంపతులు ఇటీవలే విడిపోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే వీరు తాజాగా అధికారికంగా విడాకుల కోసం బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి తమ విడాకుల పత్రాలను దాఖలు చేసారు. కోర్టుకు వీరిద్దరూ వారి వారి లాయర్లతో వేర్వేరు కార్లలో వచ్చారు. ఇద్దరూ కూడా తమ ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వీరి విడాకుల వ్యవహారంపై ఆరు నెలల్లోగా కోర్టు ఓ నిర్ణయం తీసుకోనుంది. అక్టోబర్ 31న తిరిగి వారు మళ్ళీ కోర్టుకు హాజరుకావలసి ఉంటుందని కోర్టు తెలిపిందట. వీరికి ఇద్దరు కుమారులున్నారు. అయితే కుమారులు ఎవరి చెంతకు వెళ్తారో అనే విషయం కోర్టు నిర్ణయించనుంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.