English | Telugu

రజినీతో రెండవ ఛాన్స్ మిస్సయ్యింది.

'లెజెండ్' సినిమాతో మళ్ళీ ఊపుమీదున్న నటుడు జగపతిబాబుకి ఇటీవలే రజినీకాంత్ తో మరో సినిమా చేసే అవకాశం వచ్చింది. గతంలో వీరిద్దరూ "కథానాయకుడు" సినిమాలో కలిసి నటించారు. అయితే తాజాగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రజినీ హీరోగా "లింగా" అనే ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుంది. ఇందులో విలన్ పాత్ర కోసం ముందుగా జగపతిని అనుకున్నారు. కానీ ఫైనల్ గా ఈ విలన్ పాత్రకు నటుడు సుదీప్ ను తీసుకున్నారట. రజినీతో మరోసారి చేసే అవకాశం మిస్సయ్యిందే అనే బాధ కొంచెం కూడా లేదంట జగపతికి. వస్తే బాగుండేది అని అనుకుంటున్నాడట. సినిమా ఇండస్ట్రీలో ఇలా ఆలోచించేవారు ఎంతమంది ఉంటారు చెప్పండి.

'లెజెండ్' సినిమాతో జగపతి మార్కెట్ భారీగా పెరిగిపోయింది. జగపతి తన రెమ్యునరేషన్ ను కోటికి పెంచి టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా తన స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం జగపతి చేతిలో 5భారీ చిత్రాలున్నాయి. ఈ 5 సినిమాలు హిట్టయితే జగపతిని పట్టుకోవడం చాలా కష్టమే మరి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.