English | Telugu

పెళ్లైనా త‌ల్లైనా త‌గ్గేదేలే అంటున్నారు!

పెళ్లయిన తల్లైనా డిమాండ్ ఉన్న లేకున్నా తగ్గేది లే అంటున్నారు. తమ రేంజికి ఒక్క రూపాయి తగ్గమంటున్నారు కొందరు హీరోయిన్లు. టాలీవుడ్ లో సినిమాలు చేయడం అంటే కొందరు భామలు ఒక అమౌంట్ కి ఫిక్స్ అయిపోతారు. ఆ మాటపై స్ట్రాంగ్ గా నిలబడతారు. నయనతార, సమంత, కాజల్, అగర్వాల్, హన్సిక, కీర్తి సురేష్ ఈ వరుసలో ముందుంటారు. నయనతార రేంజి రోజు రోజుకు పెరుగుతోంది. పెళ్లయింది అయినా ఈ అమ్మడు ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేస్తుంది. ఇంతకుముందు ఒక్క సినిమాకు ఐదు నుంచి 6 కోట్లు ఛార్జ్ చేసింది. కానీ ఇప్పుడు పారితోషకం రెట్టింపు చేసింది. అన్ని త‌రహా చిత్రాల‌కు, ఏ జోన‌ర్ అయినా, చివ‌ర‌కు లేడీ ఓరియంటెడ్ అయినా, హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్, క‌మ‌ర్షియ‌ల్, మాస్ మ‌సాలా ఇలా ఏ జోన‌ర్ అయినా స‌రే బెస్ట్ ఆప్షన్ కావడంతో రెట్టింపు పారితోషికాన్ని డిమాండ్ చేస్తుంది.

సమంతా నాగచైతన్యతో విడాకులు తర్వాత క్రేజ్ మరింత పెరిగింది. సినిమాల వేగం పెంచింది. వెబ్ సిరీస్ లోను నటిస్తోంది. రెండు చేతుల సంపాదిస్తుంది. ఒక్క ప్రాజెక్టుకు ఇప్పుడు నాలుగు నుంచి ఐదు కోట్లు డిమాండ్ చేస్తుంది. ఇంతకుముందు రెండు మూడు కోట్లు తీసుకునేది. ఇప్పుడు రెట్టింపు చేసుకుంటోంది. కాజల్ అగర్వాల్ పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత ఈమె బాలకృష్ణ- అనిల్ రావిపూడి కాంబినేషన్ లో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈమె ఈ సినిమాలో న‌టించేందుకు ఏకంగా మూడు కోట్లు డిమాండ్ చేసింద‌ట‌. సీనియ‌ర్ స్టార్ హీరోల‌కు హీరోయిన్ల కొర‌త ఏర్ప‌డ‌టంతో ఆమె అడిగినంత ఇవ్వ‌డానికి మేక‌ర్స్ సిద్ద‌ప‌డిన‌ట్లు స‌మాచారం. ఈమె తాజాగా అజిత్ సరసన హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలుస్తోంది.

పెళ్లికి ముందు కాజల్ ఒకటిన్నర నుంచి రెండు కోట్లు తీసుకునేది. కానీ ఇప్పుడు మూడు కోట్లు డిమాండ్ చేస్తుంది. హన్సిక కూడా ఇటీవలే పెళ్లి చేసుకుంది. ఒక్కో సినిమాకు రెండు కోట్లు డిమాండ్ చేస్తుంది. కీర్తి సురేష్ కు అవకాశాలు లేకపోయినా ఆమెను కదిలిస్తే నాలుగు కోట్లు సమర్పించుకోవాల్సిందేన‌ని అంటున్నారు. మొత్తానికి సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ల కొర‌త ఏర్ప‌డ‌టంతో వీరు ఆడింది ఆట‌... పాడింది పాట‌గా త‌యారైంది. కీర్తిసురేష్‌కి మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని, అంత ప్ర‌తిభ క‌లిగిన మ‌హాన‌టి భీష్మించుకుని కూర్చొంటూ ఖాళీగా ఉంటోందని అంటున్నారు. హీరోయిన్ల కెరీర్ చాలా త‌క్కువ కాలం మాత్ర‌మే ఉంటుంది. మ‌రి ఇప్ప‌టికి కూడా ఖాళీగా కూర్చుంటే వ‌య‌సు పెరిగి అస‌లు ఫేడ‌వుట్ అయ్యే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.